09-11-2025 12:31:40 AM
60 కిలోల పత్తి దగ్ధం
బూరుగుడా పరిధిలో ఘటన
కుమ్రం భీం అసిఫాబాద్, నవంబర్8( విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా పంచాయతీ పరిధిలోగల ఆర్‌ఎస్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పత్తి అన్‌లోడ్ చేస్తుండగా వాహనం సైలెన్సర్ నుంచి నిప్పు రవ్వలు వచ్చి పక్కనే ఉన్న పత్తికుప్పపై పడి అంటుకుంది. గమనించిన కార్మికులు నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 60 కేజీల వరకు పత్తి కాలి పోయినట్లు యజమాని తెలిపారు.