calender_icon.png 9 November, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సంపదపై ప్రైవేటు వ్యక్తుల ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేయాలి

09-11-2025 12:30:49 AM

  1. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే వారిని ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలి

ఆలిండియా జై హింద్ పార్టీ 

ఖైరతాబాద్; నవంబర్ 8 (విజయ క్రాంతి) : దేశ సంపదపై ప్రైవేటు వ్యక్తులకు, కుటుంబాలకు హక్కు ఉండకుండా రాజ్యాం గ సవరణ చేసి ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేసి దేశ సంపదను దేశ ప్రజలు అందరూ సమానంగా అనుభవించే అవకాశం కల్పించాలని ఆలిండియా జైహింద్ పార్టీ అధ్యక్షులు దశరథ రామ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.  ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే వారిని ప్రత్యేక ఎలక్షన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని అలాంటివారు ఎప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ రాజకీయాలను శాసిస్తున్న రియల్ ఎస్టేట్, సివిల్ కాంట్రాక్ట్, మద్యం వ్యాపారాలను చట్టబద్ధంగా నిషేధించాలని కోరారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బండి వినయ్ సాగర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు .

బండి వినయ్ సాగర్ ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధికి తోడ్పడడంతో పాటు నియోజక వర్గంలో 4500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని అట్టి భూమిని నియోజకవర్గంలోని పేద ప్రజలందరికీ సమానంగా పంచు తామని హామీ ఇచ్చారు. కావున 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.