30-05-2025 09:54:36 AM
హరిద్వార్: ఉత్తరాఖండ్(Uttarakhand) హరిద్వార్(Haridwar district) జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. బహదరాబాద్ ప్రాంతంలోని గిడ్డంగుల్లో మంటలు అంటుకుని అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గిడ్డంగుల్లో మంటలను ఆర్పుతున్నారు. అగ్నిమాపక అధికారి కుల్దీప్ కుమార్(Fire Officer Kuldeep Kumar) మాట్లాడుతూ, "షార్ట్ సర్క్యూట్ కారణంగా అనేక వ్యర్థ గిడ్డంగులలో మంటలు చెలరేగాయి. మేము మంటలను నియంత్రించాము" అని అగ్నిమాపక అధికారి వెల్లడించారు.