లోతు వాగులో అగ్ని ప్రమాదం
సుమారు 5 లక్షలకు పైగా నష్టం..
బాధితులకు సత్వర న్యాయం చేయాలి: సర్పంచ్ ఈసం కళ్యాణ్
కొత్తగూడెం, మే 20 (విజయక్రాంతి): లోతు వాగు గ్రామపంచాయతీ మాదిగ ప్రోలు గ్రామంలో, స్థానిక రైతు తన పొలంలో నిప్పు పెట్టగా నిప్పు రవ్వలు ఎగిరి వచ్చి అశోక్ నగర్ గ్రామపంచాయతీ వర్కర్ గా పని చేస్తున్న ,పాయం సతీష్ ఇంటిపై వచ్చి పడటంతో ఇల్లు మొత్తం కాలిపోయింది. సుమారు 5 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది, 100 బస్తాల ధాన్యం, మూడు వ్యవసాయం మోటర్లు, ఒక గ్లామర్ బైకు, ఇంట్లోని వస్త్రాలు సామాన్లు మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయాయి.
విషయం తెలుసుకున్న లోతువాగు సర్పంచ్, ఉప సర్పంచ్ వెంటనే అక్కడికి చేరుకొని చుట్టుపక్కల నివాసాలకు మంటలు వ్యాపించకుండా, పంచాయితీ ట్యాంకర్ తో నీటిని కొట్టి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై సర్పంచ్ ఈసం కళ్యాణి లక్ష్మీదేవి పల్లి ఎమ్మార్వో కి ఎస్‌ఐ కి సమాచారం అందించి ,బాధితులకు ప్రభుత్వ నుంచి సహాయం అందే విధంగా చూడాలని కోరారు.






