గాంధీనగర్‌లో 23న హిందూ సమ్మేళనం
బీజేపీ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్
ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్‌లోని ఆంధ్రాకేఫ్ చౌరస్తా వద్ద హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు ‘హిందూ సమ్మేళనం‘ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ సికింద్రాబాద్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్‌లోని హిందు బంధువులకు స్వాగతం పలుకుతూ బుధవారం కార్యక్రమ పోస్టర్‌ను శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి యువకులు, హిందూ సంఘాల నాయకులు, దేవాలయాల కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హిందూ ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రామకృష్ణ శాస్త్రి, వెంకటరమణ, డాక్టర్ చంద్రశేఖర్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వీ నవీన్ కుమార్, ఆనంద్ రావు, సోమిషెట్టి శ్రీనివాస్, రాధాకృష్ణ, సత్యనారాయణ, శకుంతల, శశికళ తదితరులు పాల్గొన్నారు.






