28 July, 2026 | 5:27 AM

సాఫ్ట్ వేర్ కంపెనిలో అగ్నిప్రమాదం.. భయంతో ఉద్యోగులు పరుగు

25-06-2024 04:11 PM

హైదరాబాద్ : జూబ్లీహిల్స్  పరిధిలో  మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు కాస్త పెద్దగా చెలరేగడంతో భవనంలోని ఉద్యోగులు భయంతో భవనం నుంచి బయటికి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, బిల్డింగ్ యాజమాన్యం నిబంధనాల విరుద్ధంగా భవనం కింద పార్కింగ్ స్థలాన్ని డంపింగ్ కోసం వాడడంతోనే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.