ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ నేతలు
న్యూఢిల్లీ : 18వ లోక్ సభ తొలి సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేశారు. గోడే నగేష్ హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా.. గడ్డం వంశీ కృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందన రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి, రామసాయం రఘురాం రెడ్ి ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. తెలుగులో సురేశ్ షెట్కర్, ఈటల రాజేందర్ ప్రమాణం చేసి చివర్లో జై సమ్మక్క-సారలమ్మ అని నినదించారు. చేతిలో రాజ్యంగం పట్టుకొని ఎంపీగా మల్లు రవి ప్రమాణం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినదించారు. డీకే అరుణ, కుందూరు రఘవీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి జై తెలంగాణ అంటూ నినాదం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లోక్ సభ ఎంపికా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం జై పాలస్తీనా అన్నారు.






