27 August, 2026 | 4:28 AM

ఇస్లామాబాద్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

27-08-2026 01:28 AM

15 మంది నవజాత శిశువులు మృతి

ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఘోరం

ఇస్లామాబాద్, ఆగస్టు 26: ఇస్లామాబాద్‌లోని పిమ్స్ చిన్నపిల్లల ఆసుపత్రి ఎన్‌ఐసీ యూ గైనకాలజీ వార్డులో బుధవారం భారీ అగ్నిప్రమాదంచోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు సజీవ దహనం అయ్యారు. ఏసీ కంప్రెషర్ పేలడం తో వార్డులో మంటలు వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అగ్నిప్రమాద సమ యంలో ఆసుపత్రిలో 16 మంది శిశువులు ఉండగా వారిలో ఒక్కరిని మాత్రమే ప్రాణాలతో రక్షించగలిగారు. ఏసీ కంప్రెషర్ పేల డంతో మంటలు వేగంగా వార్డు అంతటా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. వెం టనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయని చెప్పారు.

అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు అదనపు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కమిటీ విచారణ జరిపి అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుందన్నారు. ఇస్లామాబాద్‌లో చిన్నపి ల్లల కోసం 140 ఎకరాల్లో విస్తరించిన ఉన్న అతిపెద్ద ఆసుపత్రి పిమ్స్. 1,300 పడకలు న్న ఈ ఆసుపత్రిలో అనేక వ్యాధులకు చికిత్స అందజేస్తుంటారు. నవజాత శిశువులకు ఎన్‌ఐసీయూలో చికిత్స అందజేస్తుంటారు. ఈ అగ్నిప్రమాదంలో ఆసుపత్రిలోని నవజాత శిశువుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.