శివోహం పాటలో నటించడం నా అదృష్టం
11-02-2026 03:20 AM
తనికెళ్ల భరణి
హైదరాబాద్, ఫిబ్రవరి ౧౦ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రూపొందిన ‘శివోహం‘ పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్. యశోకృష్ణ సంగీతం. మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ పాడారు. శివోహం పాట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, నటులు తనికెళ్ల భరణి, గౌతమ్ రాజు అతిథులుగా పాల్గొన్నారు. ‘ఈ పాటలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా అని తనికెళ్ల భరణి అన్నారు.




