31 May, 2026 | 1:02 AM

నిమ్స్‌లో ఫైర్ మాక్‌డ్రిల్

31-05-2026 12:00 AM

పంజాగుట్ట, మే 30 (విజయక్రాంతి): వరల్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా పంజాగుట్టలోని నిమ్స్ లో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. శనివారం హైదరాబాద్ జి ల్లా అగ్నిమాపక శాఖ ఫైర్ ఆఫీసర్ టి.వెంక ట్, అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆపీసర్ వి.భానుప్రసాద్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు ఎం.డి.షౌకత్, పి.సాయిరెడ్డి మార్గదర్శకత్వంలో డ్రిల్ జరిగింది.

ఈ సందర్భంగా నిమ్స్ మెడికల్ సూపరిటిండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ అగ్నిప్రమాదం సంభ వించిన సందర్భంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది, భద్ర తా సిబ్బంది ఎలా స్పందించాలి, రోగులను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు.  కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ సునీల్, ట్రామా బ్లాక్ సిబ్బంది, నర్సింగ్ అధికారులు, టెక్నీషియన్లు, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.