31 May, 2026 | 1:02 AM

మహేశ్వరంలో భారీగా దొంగ ఓట్లు

31-05-2026 12:00 AM

కలెక్టర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

బడంగ్ పేట్, మే (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో భారీగా దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయంటూ బీజేపీ నేతలు రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి శనివారం వినతిపత్రం అందజే శారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో నేతలు కలెక్టర్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. పహాడీ షరీఫ్, షహీన్ నగర్, జల్పల్లి పరిధిలోని కేవలం 26 బూత్లలోనే 9,960 దొంగ ఓట్లను గుర్తించినట్లు తెలిపారు. ఒకే ఓటు పలుమార్లు నమోదు కావ డం, వయసులో తీవ్ర తప్పులు ఉండటం, హిందువుల ఇళ్ల అడ్రస్లపై ఇతర వర్గాల ఓట్లు ఉండటాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.