2 July, 2026 | 3:17 PM

Breaking News

ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •  

కుటుంబ కలహాలతో అగ్నిమాపక అధికారి ఆత్మహత్య

23-07-2024 11:58 PM

నల్లగొండ, జూలై 23 (విజయక్రాంతి): కుటుంబ కలహాల కారణం గా గడ్డిమందు తాగి నల్లగొండ జిల్లా అగ్నిమాపక అదనపు అధికారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండ లం అప్పాజిపేటకు చెందిన కేతారపు రాజు (36) ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో షాద్‌నగర్ నుంచి నల్లగొం డకు బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి నల్లగొండ మండలం కతాల్‌గూడలో సమీపం లో గ్రీన్‌సిటీలో నివాసం ఉంటున్నాడు.

కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నల్లగొండ అదన పు అగ్నిమాపక కార్యాలయంలో రిపో ర్టు చేసి అనంతరం ఇంటికి వెళ్లిన రాజు  గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యు లు గుర్తించి చికిత్స నిమిత్తం హుటాహుటిన ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మంగళవారం మృతిచెందాడు.  మృతు డి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.