2 July, 2026 | 4:26 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ధరణి లోపాలతో ప్రజలకు ఇబ్బందులు

24-07-2024 12:01 AM

రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు

సూర్యాపేట, జూలై 23(విజయక్రాంతి): ధరణి లోపాలను అడ్డుపెట్టుకుని గత పాలకులు, కొందరు అధికారులు ఎన్నో పొరపా ట్లు చేశారని మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట కాంగ్రెస్ జిల్లా కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు. నడిగూడెం మండంలోని రామాపు రానికి చెందిన ముత్తయ్యకు వారసత్వంగా వస్తున్న భూమిని ఇతరులు కబ్జా చేయడం బాధకరమని అన్నారు. బాధితుల నుంచి సమా చారం తెలుసుకునేందుకు తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. అసలు పట్టాదారులను కాదని వేరొకరికి పట్టాలు చేశారని మండిపడ్డారు. పట్వారీ వ్యవస్థ ఉన్న సమయంలోనూ ఇలాంటి సమస్యలు లేవని అన్నారు. రాష్ట్రంలో సమస్య ఎక్కడ ఉన్న తాను అక్కడికి వెళతానని, ఆ సమస్యను పరిష్కరిం చేంతవరకు బాధితుల పక్షాన ఉంటానని స్పష్టంచేశారు.