calender_icon.png 8 December, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్... తొలిరోజు వీటిపైనే చర్చ

08-12-2025 03:04:00 PM

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, పలు దేశాల దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ సమావేశం ముగియగానే వివిధ కార్యక్రమాలు, ప్రపంచంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి ప్రణాళిలపై చర్చిస్తారు. సమిట్ ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన హళ్లలో ప్యానల్ డిస్కషన్లు, తొలిరోజు 12 అంశాలపై చర్చా వేదికలు ఏర్పాటు చేశారు. 

సంబంధిత శాఖల మంత్రుల ఆధ్వర్యంలో నిపుణులు, మేధావుల చర్చ, రాష్ట్ర భవిష్యత్తు ఇంధనం, గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగుపై, ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీపై, సాంకేతిక రంగంలో సెమీకండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీపై, విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్ గా తీర్చిదిద్దే వ్యూహం, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ అభివృద్ధిపై తొలి రోజు చర్చ జరుగనుంది. అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్య మార్పిడి విధానాలు, రాష్ట్ర ఆరోగ్యరంగంలో అభివృద్ధి దిశగా తొలి రోజు చర్చించనున్నారు. 

సాంకేతికత, నైపుణ్యాలు, పెట్టుబడి భాగస్వామ్యంపై ఆస్ట్రేలియా, కొరియాతో ప్రభుత్వం చర్చించనుంది. ఆసియా దేశాలతో రాష్ట్ర ఆర్థిక భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి. గిగ్ వర్కర్లు, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఉద్యోగాల భవిష్యత్తుపై తొలిరోజు చర్చించనున్నారు. రైతుల ఆదాయం పెంపొందించే వ్యూహాలపై చర్చించనున్నారు. కెనడాతో భాగస్వామ్యం, పారిశ్రామికవేత్తలుగా మహిళల సాధికారతపై చర్చించనున్నారు.