calender_icon.png 8 December, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి ఎదుటే కుమార్తె హత్య

08-12-2025 05:29:14 PM

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. ఇటివల మేనమామ వరసయ్యే  ఉమాశంకర్ అనే యువకుడికి బాధితురాలు పవిత్రను ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి నిశ్చయమైన తర్వాత పవిత్ర, ఉమాశంకర్ మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో యువతి తన మాట లెక్కచేయట్లేదని ఉమాశంకర్ కోపం పెంచుకున్నాడు.

ఇవాళ యువతితో మాట్లాడతానంటూ ఇంటికి వెళ్లి తల్లి ముందే కత్తితో బాలిక గొంతు కోసి ఉమాశంకర్ పరారయ్యాడు. నిందితుడు పారిపోతూ కత్తిని, తన సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న వారసిగూడ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు, క్లూస్ టీం ప్రస్తుతం ఆధారాలు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ దారుణ హత్యకు గల కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.