11-12-2025 12:42:32 PM
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana Gram Panchayat Elections) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటిగంటకు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇస్తారు. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం 3,461 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించి, ఈ ప్రదేశాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూసేందుకు దాదాపు 50,000 మంది పోలీసు సిబ్బంది, 60 ప్రత్యేక పోలీసు ప్లాటూన్లు మరియు అగ్నిమాపక, అటవీ శాఖలకు చెందిన సుమారు 2,000 మంది సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు.