calender_icon.png 11 December, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల్లో దొంగఓటు కలకలం

11-12-2025 12:09:51 PM

హైదరాబాద్: భద్రాచలం గ్రామ పంచాయతీ(Bhadrachalam Panchayat) ఎన్నికల పోలింగ్ బూత్ లో దొంగఓటు కలకలం రేపింది. భద్రాచలం 11వ నెంబర్ పోలింగ్ బూత్ లో తన ఓటు ఎవరో వేశారంటూ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. కోటగిరి లక్ష్మి అనే మహిళ 11 వ నెంబర్ బూత్ లో తన ఓటు వేసేందుకు వెళ్లింది. కోటగిరి లక్ష్మి పేరుతో ఓటు అప్పటికే పోల్ అయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో లక్ష్మి తరుఫు బంధువులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. టెండర్ ఓటింగ్ ద్వారా అధికారులు మహిళతో ఓటు వేయించారు. ఆ ఓటును పరిగణలోకి తీసుకుంటారో లేదో అని మహిళ ఆందోళన వ్యక్త ం చేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరడంతో అనేక గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారుల ప్రకారం, ఉదయం 11 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది.