నేడే తొలి విడత పోలింగ్
- స్థానిక పోరుకు సర్వం సిద్ధం
షాద్‌నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు
168 పంచాయతీలు
రంగారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాంతి ): తొలి విడత స్థానిక పోరు కు సర్వం సిద్దం అయ్యింది. కొన్ని గంటలలో పోలింగ్ ప్రారంభం కానుంది. షాద్ నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్‌లోని ఏడు మండలాలని గ్రామాలకు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు పీ ఓ, ఓపీ ఓ లు ఆయా పంచాయతి లకు చెందిన బ్యాలెట్ పేర్లు, బాక్స్ల ను తమ వెంట తీసుకెళ్లారు. ఎన్నికల ప్రక్రియలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1పీఎం వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం 2 పీఎం నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ నిర్వహించి గెలిచిన అభ్యర్థికి ఎన్నికల ధ్రువపత్రం అందజేస్తారు. అనంతరం వార్డు సభ్యుల మద్దత్తు ఉన్న వారికి ఉప సర్పంచ్ గా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. పోలింగ్ జరిగే పంచా యతీలో పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్త్ చేపట్టి ఎలాంటి అవాంచనీయ ఘటన లు జరగకుండా పోలీసులు సీసీ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను మాటరింగ్ చేస్తు న్నారు.
పోలింగ్ సెంటర్లలో స్టేజ్-1, స్టేజ్-2 ఆర్వోలు, పీవోలు, ఓపీవోలు కలుపుకుని 3,536 అవసరం ఉండగా 4,243 ఉన్నారు. తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అలాగే 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3,379 మంది అభ్యర్థులు బరి లో నిలిచారు.ఆరు సర్పంచ్ స్థానాలు...
ఏకగ్రీవమయ్యాయి. అందులో ఫరూక్నగర్, కేశంపేట, నందిగామ మండలంలో ఒక్కో గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా కొందుర్గు మండలంలో మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి, ఐదు స్థానాలు పాలకవర్గంతో పాటు ఏకగ్రీవమయ్యాయి. కేశంపేట మండలంలోని దేవునిగుడి తండా, కొందుర్గు Exactly చెరుకు పల్లి, పాత అగిర్యాల, లక్ష్మీదేవునిపల్లి, నందిగామ మండలంలో కన్హా గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి.
పంచాయతీ ఎన్నికల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
రాజేంద్రనగర్, డిసెంబర్ 10: తొలి విడతా పంచాయతీ ఎన్నికలో ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శంషాబాద్ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం లో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారి గా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు.
పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మైక్రో అబ్సర్వర్‌ల తో మాట్లాడి పలు సూచనలు చేసారు. ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు.
ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ సిబ్బంది నిర్వహించే వారి విధులను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమం లో రాజేందర్ నగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో మున్ని, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తొలి విడత జరిగే మండలాలు
షాద్‌నాగర్, రాజేంద్రనగర్ నియో జకవర్గాలులోని ఏడు మండలాలు..
1) కొత్తూర్, 2) నందిగామ, 3) కేశంపేట్, 4) కొందుర్గ్, 5) జిల్లెడ్ చౌదర్ గూడ, 6) ఫరూక్ నగర్, 7) శంషాబాద్.బవ






