calender_icon.png 14 November, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటిసారి అమెరికా ప్రయాణం

08-11-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

అది 2009వ సంవత్సరం. మొదటిసారి అమెరికా ప్రయాణం. అ మెరికాలో ఉన్న అమ్మాయి శ్రావణి ఇక్కడ హైదరాబాదు విమానాశ్రయంలో ప్రవేశించింది మొదలు మళ్లీ అమెరికాలో దిగేదా కా నేనెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూసగుచ్చినట్లు చెప్పింది. అమ్మాయి చెప్పిన విషయాలన్నీ ఒక కాగితం మీద రాసుకున్నాను. ఆ కాగితాన్ని టికెట్ల కంటే, పాస్‌పోర్టు కంటే భద్రంగా దాచుకున్నాను. మళ్లీ మళ్లీ చదువుకున్నాను.

విమానం ఎక్కడానికి ఒక వారం రోజుల ముందుగానే ఆ కాగితాన్ని, టికెట్లను, పాస్‌పోర్టు ను, లగేజీని ఎన్నిసార్లు చూసుకున్నానో నాకే తెలియదు. నా ప్రయాణం రోజు రానే వచ్చింది. నా పెద్ద కుమారుడు క్రాంతి కారులో నన్ను హైదరాబాదు విమానాశ్రయానికి తీసుకొని వచ్చాడు. మొదటిసారి విమానం ఎక్కబోతున్నాను కనుక నాకు భయమేసింది. నాకంటే నా భార్య ప్రమీలే నయమనిపించింది. ఆమె నాకం టే ముందుగానే ఇక్కడెక్కి అమెరికాకు సులభంగా వెళ్లగలిగింది.

శ్రావణి చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని విమానం ఎక్కాను. మధ్యన కౌలాలంపూర్‌లో దిగాను. అది చాలా పెద్ద విమానాశ్రయం. అదృష్టవశాత్తు లాస్ ఏంజిల్స్ వెళ్లే ప్రయాణికుడు ఒకాయన నాకు కొన్ని సూచనలు చేశాడు. వాటిననుసరించి తిరిగి విమానమెక్కి లాస్‌ఏంజిల్స్‌లో దిగాను. ఇక్కడి ప్ర యాణ విశేషాలు చెప్పకుండా ఉండలేను. కౌలాలంపూర్ దాకా విమానం ఇరుకనిపించింది. విమానం ఎప్పుడు దిగుతానా అనిపించింది.

భయమేసినప్పుడు గాయ త్రీ మంత్రాన్ని స్మరించమని చెప్పిన గోపదేవ్ గారు గుర్తుకువచ్చారు. అందుకే ఆ మంత్రాన్ని రక్షాకవచంగా భావించాను. వి మానం ఎంత ఎత్తున ఎగురుతుంది? ఎన్ని మైళ్లు ప్రయాణించింది? ఇంకా ఎన్ని మైళ్లు ప్రయాణించాలి? అనే విషయాలను మాటిమాటికి నాకెదురుగా ఉన్న డిస్‌ప్లేలో చూడసాగాను.

అప్పడప్పుడు లేచి నిలబడడం, విండో గుండా బయటికి చూడడం, ఎయిర్‌హోస్టులిచ్చే అల్పాహారాన్ని తీసుకోవడం అన్ని బాగానే ఉన్నాయి గాని, ఎవరూ విమానంలో పరిచయమున్నవా రు లేకపోవడం బాధ కలిగించింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చినవాళ్లను మోస్తూ వి మానం సాగుతూ ఉంది. 

చిన్న పిల్లాడినైపోయా..

ప్రయాణికులు విమాన ప్రయాణం అలవాటైనట్లుంది కనుక వారు పరస్పరం ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కొందరు బుక్ రీడింగ్ చేస్తున్నారు. కొందరు చిరుదిండ్లు తింటుంటే కొందరు వైన్ సేవిస్తు న్నారు. ఎవరికీ ఎప్పుడు గమ్యం చేరుతామనే బాధలేనట్లు వారి వారి ముఖాలు చూస్తే అవగతమవుతుంది. ఎయిర్ హో స్టులెన్నెన్ని తినుబండారాలిస్తారో! నేను చిన్న పిల్లవాడినయ్యాను వాటిని తింటానికి. విమానాల్లో ఫ్యాన్లు కనిపించవు.

కాని ఎయిర్‌హోస్టులు ఫ్యాన్లలాగా తిరుగుతారు. విమానంలో ఉంటే రాత్రి తెలియ దు, పగలు తెలియదు. నేనెప్పుడు నిద్రపోయానో, ఎప్పుడు లేచానో నాకే తెలియదు. అయితే నేను మాటిమాటికి ‘డెస్టినేషన్’ గమనించడం మాత్రం మానలేదు. రెండు విమానాలెక్కి లాస్ ఏంజిల్స్‌లో బాగానే దిగాను. విమానాశ్రయంలో అన్ని నిబంధనల్ని పాటిస్తూ లగేజ్ దగ్గరికి వచ్చాను. ఆకాశంలో గ్రహాల్లాగా సూట్‌కేసులు ‘బ్యాగేజ్ కరోజెల్’ మీద తిరుగుతున్నాయి.

ఓ పది నిమిషాలకు కానీ నా లగేజీ నాకు దొ రకలేదు. అతికష్టం మీద నా పెద్ద బ్యాగు లు రెండు, చిన్నవి రెండు జాగ్రత్తగా ఒక స్టోలర్ మీద పెట్టుకుని బ్రతుకుజీవుడా అని నిష్ర్కమణ ద్వారం వైపు బయల్దేరాను.  అంతవరకు బాగానే ఉంది. అక్కడ ప్రత్యక్షమయ్యాడు కస్టమ్స్ అధికారి! ఆ బ్యాగుల్లో ఏమున్నాయంటూ నన్ను చా లా ప్రశ్నలు వేశాడు. 

నేను వ్యాపారిని కాదయ్యా!

అయితే ఓపికగా అన్నింటికీ సమాధానమిచ్చాను. నయం ఇంకా బ్యాగులు విప్పి చూడలేదతడు. కానీ నన్ను వ్యాపారిననుకొని ఏం వ్యాపారం చేస్తావని అడిగాడు. ‘నేను వ్యాపారిని కాదయ్యా బాబు!’ అన్నా ను. నా భాషలో కస్టమ్స్ అధికారి ప్రశ్నలడిగితే చక్కగా సమాధానం చెప్పేవాణ్ణి. కా నీ అతడి ఇంగ్లీషు నాకు రాదాయే!. అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఒక విధం గా కష్టతరంలా మారింది. అందుకే కష్టపెట్టే వాళ్లు ‘కస్టమ్స్’అధికారులేమో అని పించింది!.

చివరికతడు ఏం చేస్తుంటావు అని అడిగాడు తన భాషలో.. వ్యాపారిని కాదని చెప్పిన తర్వాత. ‘నేను ప్రొఫెసర్‌ను’ అని గట్టిగా సమాధానమిచ్చాను. అతడు ‘విజిటింగ్ కార్డు చూపెట్టు’ అన్నాడు నా మాటల మీద నమ్మకం లేకపోవడం వల్ల. అదృష్టవశాత్తు నా విజిటింగ్ కార్డు నా జేబులోనే ఉంది. దాన్ని జేబులో భద్రంగా ఉంచుకో అని శ్రావణి చెప్పడం నయమైం ది. దాన్ని జేబులో నుంచి తీసి అతనికిచ్చాను. అతడు దాన్ని, నన్ను కలగలిపి చూసి ‘What is Your Subject’ అని అడిగాడు.

సమాధానంగా ‘తెలుగు’ అని చెప్పాను. అతడు ‘Ok Thankyou’ అని నన్ను పోనిచ్చాడు. అతని నుంచి బయపటడడం.. పులి నోటిలో నుంచి బయటప డడం ఒకటే అనుకున్నాను. ప్రొఫెసర్ అని చెప్పడం వల్ల అతడు నన్ను వదిలాడుగాని లేకపోతే ఇంకా నన్నెన్ని ప్రశ్నలతో బాధపెట్టేవాడో! లగేజీతో విమానాశ్రయం బయ టికి వచ్చాను. వెలుపలికి రాగానే కళ్లు తిరిగినట్లుంది. సరిగా పట్టుకున్నానో లేదో గా ని, స్టోలర్ మీది నాలుగు బ్యాగు లు నాలు గు దిక్కులకు పరిగెత్తాయి. ఎవ రో ఒక అ మెరికన్ నా అవస్థను గమనించాడు కాబో లు, అతడు సహాయపడడం వల్ల తిరిగి నా బ్యాగులను స్టోలర్ మీద ఉంచగలిగాను. 

నిమిషం ఒక యుగంలా..

శ్రావణి కోసం అటూ ఇటూ చూశాను. ఎక్కడా ఆమె జాడ కనిపింలేదు. ఇంత కష్టపడి, అంతదూరం నుంచి వస్తే పిల్లలు వెంటనే కనిపించకపోవడం ఇబ్బందిగా అనిపించింది. స్టోలర్ మీద లగేజీని ఉంచి అట్లాగే నిలబడ్డాను. ఆ క్షణంలో నాకు ఏడ్పొచ్చినంత పనైంది. నా లగేజీని స్టోలర్ మీద తిరిగి ఉంచిన అమెరికన్‌తో ‘ ఈ నెంబరుకు ఫోను చేయగలరా?’ అని అడిగాను. సమాధానంగా అరగంటలో వస్తు న్నామని వారు తెలియజేసినట్లు నాకతడు తెలియజేశాడు.

ఆ సమయంలో ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలా అనిపించిం ది. ఎట్టకేలకు శ్రావణి తన భర్త నాగరాజుతో కలిసి వచ్చింది. ‘టైంకు ఎందుకు లేరు’ అని అడిగాను. ‘ విమానం లేటనుకున్నాం. కానీ ఇవాళ రైట్ టైంకు వచ్చింది’ అని బదులిచ్చారు. ఎలాగైతేనేమి కారెక్కి అరగంటలో అమ్మాయి నివాసానికి చేరుకున్నాను. అంతకుముందే అమెరికాకు వచ్చి ఉన్న ప్రమీల ‘ప్రయాణం ఎలా సాగింది’ అని అడిగింది. ‘చాలా చాలా బాగా జరిగింది’ అని జవాబు చెప్పకుండా ఉండలేకపోయాను.

వ్యాసకర్త సెల్: 9885654381