29 June, 2026 | 10:17 PM

స్కాట్లాండ్ బోణీ

08-06-2024 12:39 AM

బ్రిడ్జ్‌టౌన్: పొట్టి ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో స్కాట్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్ నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జేన్ గ్రీన్ (28), నికో డేవిన్ (20) పర్వాలేదనిపించారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ 3 వికెట్లతో రాణించగా.. బ్రాడ్లీ 2, సోల్, గ్రీవ్స్, లీస్క్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం స్కాట్లాండ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి విజయంసాధించింది. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైకెల్ లీస్క్ ( 17 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నమీబియా బౌలర్లలో ఎరాస్మస్ 2 వికెట్లు తీయగా.. ట్రంపెల్‌మన్, లుంగామెని, స్కోల్ట్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు. మైకెల్ లీస్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.