18 July, 2026 | 6:41 PM

Breaking News

మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •  

విష ప్రయోగంతో చేపల మృతి

19-05-2026 12:14 AM

అచ్చంపేట మే 18: మండల పరిదిలోని లింగోటం చెరువు సమీపంలోని చవటకుంటలో భారీగా చేపలు మృతి చెందడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. విష ప్రయోగంతో చేపలు మృతి చెందినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పట్టణం నుంచి వస్తున్న మురుగునీరు కుంటలో కలవడంతో కలుషిత నీటి కారణంగా చేపలు మృత్యువాత పడినట్లు గ్రామ యువకులు ఆరోపించారు.

చేపలు చనిపోయి.. నీళ్లపై తేలడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలోని మురుగునీరు చవటకుంటలోకి వెళ్లకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు, మత్య్సకారులు, యువకులు కోరుతున్నారు.

చవటకుంట కంటే ముందే ఉన్నా మల్లంకుంటలో కూడా మురుగునీరు చేరుతుందని కానీ అక్కడ మాత్రం చనిపోని చేపలు ఈ కుంటలో ఎలా చనిపోతాయని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.  ఘటనపై సంబందిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనల వల్ల లింగోటం, వలపట్లకాలని  యువకుల మధ్య గోడవలు చోటు చేసుకుంటున్నాయని..  అన్నింటిని పరిగణలోకి తీసుకోని విచారణ చేయాలని  అధికారులకు విజ్ఞప్తి చేశారు.