18 July, 2026 | 7:11 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

బాధితుల పట్ల బాధ్యతాయుతంగా పని చేయాలి

19-05-2026 12:16 AM

ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నాగర్ కర్నూల్ మే 18 (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఇవ్వాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం జిల్లాలోని ఆయా మండలాల్లో నూతనంగా నియమించబడిన ఎస్‌ఐలకు దిశా నిర్దేశం చేశారు.

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల విశ్వాసాన్ని పొందగలమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కల్పించాలన్నారు. తెల్కపల్లి ఎస్త్స్రగా రమేష్, వంగూరు ఎస్త్స్రగా మాధవరెడ్డి, ఉప్పునుంతల ఎస్త్స్రగా మహేష్, బిజినపల్లి ఎస్త్స్రగా శంషుద్దీన్, తిమ్మాజీపేట ఎస్త్స్రగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.