calender_icon.png 12 November, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడ్పల్ ఖాజాపూర్ చెరువుల్లో చేప పిల్లల విడుదల

12-11-2025 09:36:28 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్/ఖాజాపూర్ గ్రామ చెరువులల్లో బుధవారం నాడు 100% ప్రభుత్వ రాయితీపై చేప పిల్లలను విడుదల చేశారు. ప్రభుత్వం తరపున జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఎల్.హన్మంతు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ సీనియర్ నాకులు బ్యాతయ్యా, ఒంటరి నారాయణ్ రెడ్డి, చిన్నపట్ల రామ్ రెడ్డి, కొండే సాయిలు, బుగ్డాల రాములు, నాట్కరి రవి, శివాజీ, తుకారాం గౌడ్, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.