calender_icon.png 12 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలిమినేడు పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లల విడుదల

12-11-2025 09:05:45 PM

సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి..

చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన చేప పిల్లలు 1 లక్ష 49 వేల చేప పిల్లలను వెలిమినేడు మత్స్య పారిశ్రామిక సొసైటీ ఆధ్వర్యంలో వెలిమినేడు పెద్ద చెరువులో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెలిమినేడు మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షుడు కావాలి శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ పాపయ్య, అంతటి నర్సింహ్మ, అంశాల సత్యనారాయణ, అంతటి రాజు, గుర్రం జంగయ్య, పిట్టల స్వామి, రైతులు, మత్స్య పారిశ్రామిక కార్య వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.