27 June, 2026 | 9:20 AM

వాహనాలకు ఫిట్‌నెస్ తప్పనిసరి

14-06-2024 01:00 AM
  • నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

జగిత్యాల జిల్లా రవాణా అధికారి వంశీధర్

జగిత్యాల, జూన్ 13(విజయక్రాంతి): విద్యాసంస్థల యాజమాన్యాలు తమ స్కూల్ వాహనాలకు ఫిట్‌నెస్ ఉండేలా చూసుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని జిల్లా రవాణా అధికారి వంశీధర్ హెచ్చరించారు. జగిత్యాలలో గురువారం ఉదయం 11 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని మూడు స్కూల్ బస్సులు, ఐదు ఇతర వాహనాలను సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 464 స్కూల్ బస్సులు ఉండగా.. 300 వరకు ఫిటినెస్ కలిగి ఉన్నాయన్నారు. మిగతా వాహనాలకు కూడా తప్పనిసరిగా ఫిటినెస్ చేపించాలని, అప్పటి వరకు రోడ్లపై తిప్పవద్దని సూచించారు.