16 May, 2026 | 2:02 AM

గంజాయిని రవాణా చేస్తున్న ఐదుగురు నిందితుల అరెస్ట్

16-05-2026 01:04 AM

రూ.లక్ష విలువ గల 2.2 కేజిల గంజాయి స్వాధీనం

నల్లగొండ క్రైం, మే 15 :  గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కనగల్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన బొడ్డు చందు, కానుగు సాయిరాం, జిల్లా చందు, బొమ్మరబోయిన అంజి అలియాస్ నిరంజన్, మునుగోడు గ్రామానికి చెందిన చాడ క్రాంతికుమార్ లు జి ఎల్ గార్డెన్ వద్ద గంజాయి పంపిణీ చేస్తున్న సమయంలో కనగల్ ఎస్త్స్ర రాజీవ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వారిని అదుపులో తీసుకొని విచారించారు. లక్ష రూపాయల విలువైన 2.2 కేజిల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అయితే దూల్ పేట నుండి గంజాయి తీసుకొచ్చినట్లు వారు ఒప్పుకున్నారన్నారు. ఎవరైనా గంజాయిని రవాణా చేస్తే సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. కేసును చేదించిన సిబ్బందిని అభినందించారు.