calender_icon.png 14 July, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్

14-07-2025 01:43:06 AM

ఘట్‌కేసర్, జులై 13 : గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గంజాయిని సేవిస్తున్న ఐదుగురు యువకు లను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పందిరి పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని ఓఇంట్లో పలువురు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అడ్మిన్ ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు.

దాడిలో పట్టణానికి చెందిన అబ్బగోని అరవింద్ (25), సుంకరబోయిన ఉదయ్ కుమార్ (22), పగడాల కార్తీక్ (19),  కుందూరు శివ (22), టక్కని వినోద్ (23) లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 460 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులను కోర్టు కు తరలించి కేసు దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.