రూపాయి బలహీనం
- 9 పైసలు తగ్గిన విలువ
ముంబై, జూన్ 6: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేపథ్యంతో స్టాక్ మార్కెట్ తరహాలోనే రూపాయి సైతం ఒడిదు డుకులకు లోనవుతున్నది. మంగళవా రం భారీగా పడిపోయిన రూపాయి బుధవారం స్వల్పంగా కోలుకున్నప్పటికీ, గురువారం తిరిగి క్షీణించింది. తాజాగా ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 83.53 వద్ద ముగిసింది. జూన్ 4న ఇది 40 పైసల మేర పతనమైన సంగతి తెలిసిందే. ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండు రోజులు ర్యాలీ జరిపినప్పటికీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరపడంతో రూపాయి క్షీణించిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
83.20 శ్రేణిలో హెచ్చుతగ్గులు
ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు పెర గడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విక్ర యాల ఫలితంగా దేశీయ కరెన్సీ తగ్గిం దని బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. ఈ అంశాల కారణంగా సమీప భవిష్యత్తులో రూపా యి బలహీనంగానే ట్రేడవుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వచ్చే కొద్ది రోజుల్లో 83.20 శ్రేణిలో కరెన్సీ హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని భావిస్తున్నట్టు చౌదరి తెలిపారు. ప్రపంచ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ స్వల్ప తగ్గుదలతో 104.18 స్థాయికి చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78.65 డాలర్ల సమీపంలో ట్రేడవుతున్నది.






