3 April, 2026 | 6:41 AM

హనుమకొండలో 5కే రన్

06-05-2024 02:04 AM

హనుమకొండ, మే 5 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని వరంగల్, హనుమకొండ జిల్లాల ఎన్నికల అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్‌ఎస్ మైదానంలో ఆదివారం ఉదయం 5 కె రన్ నిర్వహించారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు చేపట్టిన ఈ ర్యాలీలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ఎన్నికల సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్ రణ్‌వీర్ చంద్ పాల్గొని ప్రజలను ఉత్సాహ పరిచారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పోలింగ్ సందేహాలను నివృత్తి చేసేందుకు రూపొందించిన ఓటర్ బడ్డీ లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు దిలీబన్, ధీరజ్ సింగా, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, సంధ్యారాణి, ట్రెయినీ ఐపీఎస్ శుభం, కేయూ వీసీ తాటికొండ రమేష్, నిట్ డైరెక్టర్ విద్యాధర్, పోలీస్ అధికారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.