గెలుపే లక్ష్యంగా పనిచేయండి
06-05-2024 02:04 AM
బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ
మహబూబ్‌నగర్, మే 5 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపునిచ్చారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ఉర్కొండపేట, ముచ్చర్లపల్లి, తిమ్మాలపల్లి, మాదారం గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. పార్టీ నేతలను కలిసి ప్రచారంపై సూచనలిచ్చారు. ప్రత్యర్థుల అర్థరహిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు.




