calender_icon.png 25 August, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డిలో 5కే రన్

25-08-2025 12:00:00 AM

సంగారెడ్డి, ఆగస్టు 24 : సంగారెడ్డి జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం 5కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు, క్రీడాకారులు, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, టీఎన్జీవోలు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేసినట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఎం.ఖాసీం బేగ్ తెలిపారు.