25-08-2025 09:51:12 AM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో జరుగుతున్న జనహిత పాదయాత్రలో భాగంగా గంగాధర మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan) శ్రమదానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, నరేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు అగ్రనేతలతో కలసి శ్రమదానంలో పాల్గొన్నారు. ప్రజల్లో సేవాభావం పెంపొందించడమే ఈ శ్రమదానం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మహేష్ కుమార్ అన్నారు. గ్రామాభివృద్ధి, సమాజ అవసరాలకు తోడ్పడే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతో కలసికట్టుగా ఉంటుందన్నరు.