9 March, 2026 | 7:50 AM

ప్లాట్లు ఆక్రమించిన ఐదుగురు రిమాండ్

07-03-2026 12:09 AM

ఘట్‌కేసర్, మార్చి 6 (విజయక్రాంతి) : అసలు యజమానికి బదులు మరోకరితో 2 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకుని ఆక్రమించిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఘట్ కేసర్ సీఐ ఎం. బాలస్వామి తెలిపారు. 

ఘట్ కేసర్ పోలీసు స్టేష న్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్ కేసర్ పట్టణ పరిధి పటేల్ నగర్ లో సర్వే నెంబర్ 153 లోని 2 ప్లాట్లలను అన్నోజిగూడకు చెందిన కాసుల గణపతి, ఘట్ కేసర్ కు చెందిన సాలూరి రమేశ్, తోక శ్రీరాములు, కిరిటం జగదీష్, హసన్ లు అసలు యజమానికి బదులు మరొకరిని యజమానిగా చూపిస్తూ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ పొందారు.

ఆ డాక్యుమెంట్ల ఆధారంగా 2 ప్లాట్లను తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకుని ఆక్రమించారు. విష యం తెలుసుకున్న బాధితురాలు డాక్టర్ వాణి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు జరిపి నిందితులు గణపతి, రమేశ్, శ్రీరాములు, జగదీష్, హసన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.