09-10-2025 12:40:02 AM
చేవెళ్ల, అక్టోబర్ 8: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండో భార్యను భర్త కిరాతకంగా హతమార్చి, మొదటి భార్యకు ఫొటోలు పంపాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. చేవెళ్ల మండలం ఆలూర్ అనుబంధ గ్రామం వెం కన్నగూడకు చెందిన వానరాసి జంగయ్య (35) హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జంగయ్యకు ఇద్దరు భార్యలు.
మొదటి భార్య ప్రమీల (33), రెండో భార్య రజిత (30). రజితతో జంగయ్యకు మనస్పర్థలు రావడంతో రెండేళ్ల నుంచి భర్తకు దూరంగా రజిత ఉంటున్నది. పలుమార్లు పెద్దల సమక్షంలో సర్దిచెప్పినా సయోధ్య కుదరలేదు. ఈ విషయమై జంగ య్య మరోసారి రజితను తనతో ఉండాలని సోమవారం గ్రామానికి పిలిపించి, పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. అయినా కూడా రజిత తన భర్తతో ఉండేందుకు నిరాకరించింది.
ఆ తర్వాత రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు గ్రామ సమీపంలో మద్యం సేవించారు. అనంతంరం జంగయ్య రజితను చున్నీతో ఉరేసి, సిమెంట్ కడ్డీతో బాది హతమార్చాడు. ఆపై తన మొదటి భార్యకు ఫొటోలు పంపి, వీడియో కాల్ చేసి చూపించారు. అనంతరం గ్రామస్థులకు విషయం తెలిపి, చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.