28-01-2026 10:30:22 PM
హనుమకొండ,(విజయక్రాంతి): పరకాల పురపాలక సంఘంలో 22 వార్డులకు నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది. 22 వార్డులకు గాను అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించేందుకు ఏడు కౌంటర్లను ఏర్పాటు చేయగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించారు. తొలి రోజు బుధవారం 7,11,16,18,20 వార్డులకు ఒక్కో నామినేషన్ చొప్పున ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, పురపాలక కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.