28-01-2026 10:27:03 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ లో మొదటి రోజు బుధవారం పదిహేను మంది అభ్యర్థులు పదిహేడు నామినేషన్ లు వేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభం కాగా నామినేషన్ల నిర్వహణ కోసం మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా భవనంలో ఇరవై ఆరు వార్డులకు ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేసి అధికారులను నియమించారు. మున్సిపల్ లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు కమిషనర్ మోహన్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ కి చెందిన నాలుగురు అభ్యర్థులు ఐదు నామినేషన్ లు వేయగా,బిఆరెస్ కు చెందిన నలుగురు అభ్యర్థులు ఐదు నామినేషన్ లు వేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు ఐదు నామినేషన్ లు వేయగా స్వాత్రంత్ర అభ్యర్థులు ఇద్దరు నామినేషన్ లు వేశారు. మొత్తం పదిహేడు నామినేషన్ మొదటి రోజు వేశారు.