calender_icon.png 28 January, 2026 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ కమిటీ సభ్యులు లేకుండానే ఇల్లు ప్రారంభిస్తారా...?

28-01-2026 10:14:19 PM

కమిటీ సభ్యుల పట్ల ప్రవర్తించిన తీరు సరికాదు

ఎంపీడీవో, గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ని దేశాయిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును బుధవారం గ్రామ సర్పంచ్ తో పాటు ఎంపీడీవో ఆనంద్, గ్రామ కార్యదర్శి గీతలు ప్రారంభించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారని కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులను గుర్తించి ఇల్లు ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే మంజూరుకు కృషి చేసింది.

మాజీ సర్పంచ్ శ్రావణ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాత్రమేనని అలాంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఇంటి ప్రారంభానికి ఎందుకు పిలువలేదని కమిటీ సభ్యులు లేకుండా ఎలా ప్రారంభిస్తారని ఎంపీడీవో ఆనందును గ్రామ కార్యదర్శి గీతను గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి నిరాదీశారు. గ్రామంలో ఒకే వర్గానికి గ్రామ కార్యదర్శి వత్తాసు పలుకుతున్నారని గ్రామ పెద్దలను సీనియర్ నాయకులను కమిటీ సభ్యులను పిలువకపోవడంలో ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. అదేవిధంగా ఏ కార్యక్రమానికి పిలవడం లేదని ఒకే వర్గానికి పిలవడం సరికాదని వారి మండిపడ్డారు.

కమిటీ సభ్యుల పట్ల ప్రవర్తించిన తీరు సరికాదన్నారు.ఇప్పటికైనా ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు మానుకొని గ్రామ కార్యదర్శి గ్రామంలోని సీనియర్ ప్రజాప్రతినిధులను గ్రామ పెద్దలను పిలవాలని ఇలాంటి పునరావృతం కావద్దని వారు ఎంపీడీవోకు వివరించారు. దీంతో గ్రామ కార్యదర్శి గీత కమిటీ సభ్యులను గ్రామ పెద్దలను పిలవకపోవడం తప్పుగా భావించి గ్రామస్తులకు క్షమాపణ తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని గ్రామంలోని అందరినీ కలుపుకొని కార్యక్రమాలు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.