calender_icon.png 29 January, 2026 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి ఫోటోగ్రాఫర్లకు మార్గదర్శకుడు తూర్పాటి రాజయ్య

28-01-2026 09:58:14 PM

రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్షలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని ప్రాంతంలోని నేటి  ఫోటోగ్రాఫర్లకు సీనియర్ ఫోటో గ్రాఫర్ తూర్పాటి రాజయ్య మార్గదర్శకులు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాజయ్య కుటుంబ సభ్యులను బుధవారం మంథని పట్టణంలోని వారి స్వగృహంలో శ్రీధర్ బాబు పరామర్శించారు.

సౌమ్యనిగా అందరితో కలుపుకోలుగా ఉండే రాజయ్య మృతి వారి కుటుంబ సభ్యులకే కాకుండా అందరికీ తీరనిలోటని  పేర్కొన్నారు. వారి కుమారులను ఉన్నతమైన స్థానంలో చూడాలనే లక్ష్యాన్ని ఆయన కుమారులు నెరవేర్చారని, రాజయ్య కుమారులు కూడా ఎటువంటి వివాదములు లేకుండా తమ తమ వృత్తుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని  కొనియాడారు.