28-01-2026 09:54:44 PM
సిద్దిపేట క్రైం: మున్సిపల్ ఎన్నికల జరిగే హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ లోని నామినేషన్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలిపారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోపు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, కర్రలు, లాఠీలు, రాళ్లు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, ఇతర ఆయుధాలను కలిగి ఉండటం చట్టరీత్యా నిషేధమని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.