11 July, 2026 | 2:11 AM

సింగరేణిలో 5 గనులకు ఫైస్టార్ రేటింగ్

11-07-2026 12:00 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు 

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): కేంద్ర బొగ్గు శాఖ ప్రతీ ఏటా నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపికలో ఈ సారి సింగరేణి  నుంచి 5 గనులు ఫై-స్టార్ రేటింగ్ సాధించి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యాయి. శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్‌కే న్యూటెక్, ఆర్‌కే -6, సత్తుపల్లి ఏ రియా నుంచి జేవీఆర్ ఓసీ 2, బెల్లంపల్లి ఏ నుంచి ఖైరిగూడ ఓపెన్ కాస్టు గని, రామగుండం- 3 నుంచి ఆర్‌జీ ఓసీ -1 గనులు అ త్యుత్తమ ఫైస్టార్ రేటింగ్ గనులుగా ఎంపికైనట్లుగా ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా 382 గ నులు ఈ 5 స్టార్ రేటింగ్ కోసం దరఖా స్తు చేసుకోగా అందులో 50 గనులు 5 స్టార్ రేటింగ్ ఎంపికయ్యాయి. అందులో 5 గ ను లు సింగరేణి నుంచి ఉండటం విశేషం. గతే డాది నాలుగు గనులకు ఈ ఫై-స్టార్ రేటింగ్ రాగా ఈ సారి 2024-.25కి సింగరేణి 5 గనులకు ఫైస్టార్ రేటింగ్ లభించడం విశేషం.  మొత్తం 50 అంశాలలో అత్యుత్తమంగా ఈ ఐదు గనులు నిలిచాయి.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  అధికారులకు, కార్మికులకు, సిబ్బందికి  అభినందనలు తెలిపారు.