12 August, 2026 | 12:56 AM

5 వేల కిలోల గంజాయి ధ్వంసం

15-06-2024 12:03 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు పట్టుబడిన గంజాయిని ధ్వంసం చేశారు. కమిషనరేట్ పరిధి లోని పలు పోలీస్‌స్టేషన్లలో గత మూడేళ్లు గా స్వాధీనం చేసుకున్న వివిధ రకాల మాదకద్రవ్యాలను శుక్రవారం ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. వాటిలో గంజాయి మొక్కలు గ్రాములు, హష్ ఆయిల్  కొకైన్ గ్రాములు, చరాస్ మెఫాడ్రోన్ గ్రాములు, ఎక్‌స్టెసీ ట్యాబ్లెట్లు ఎల్‌ఎస్‌డీ44పేపర్స్, హెరాయిన్  గ్రాములు, మెటాపాటామైన్ గ్రాములు, లిక్విడ్ ఓపియం గ్రాములు, జెల్ గంజా  గ్రాములు ఇలా మొత్తం 15 రకాల మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 30 పోలీస్ స్టేషన్లలో నమోదైన 122 కేసుల్లో మొత్తం 5వేల కిలోలు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.  కమిషనరేట్ సమీపంలో ఉన్న బయో మెడికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ కె.నరసింహా, సైబర్ క్రైమ్ ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ కళింగరావు, నార్కోటిక్స్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు.