ప్రభుత బడుల బలోపేతనికి కృషి
ఆదిలాబాద్ ఎంపీ నగేష్
ఆదిలాబాద్, జూన్ 14 (విజయ క్రాంతి): ప్రభుత పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థుల కోసం పనిచేయడం ఆనందంగా ఉంటుందన్నారు. అదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ ప్రభుత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే లు భూమిపూజ చేశారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటబజార్‌హత్నూర్ మండలంలోని ఓ పాఠశాలకు శంకుస్థాపన చేశానని గుర్తు చేసుకున్నారు. కేంద్రం నుంచి నిధులను తీసుకువచ్చి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... రాష్ర్ట ప్రభుతం కూడా విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని సారించాలని కోరారు. అనంతరం యపల్ గూడ గ్రామస్థులు ఎంపీ, ఎమ్మెల్యేలను శాలువాతో సత్కరించారు.






