కాంగ్రెస్ సర్కార్‌పై పెరుగుతున్న విశ్వాసం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 14(విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన ఐదుమాసాల్లోనే కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుమారు 100మంది ముస్లిం నాయకులు కాంగ్రెస్‌లో చేరగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ యాకూబ్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు, తాజా మాజీ ఉప సర్పంచ్ మహ్మద్ మైనొద్దీన్ ఆధ్వర్యంలో గొర్లవీడు మజీద్ కమిటీ సభ్యులతో పాటు యాదవ సంఘం అధ్యక్షులు రాజ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ఫాజిల్, గణపురం మండల కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ చోటే మియా, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ ఇర్ఫాన్, మైనార్టీ టౌన్ అధ్యక్షుడు మహ్మద్ హైమద్, జిల్లా యూత్ నాయకులు అబ్దుల్ హఫీజ్, మహ్మద్ సాబీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి
వర్షాకాలంలో పంటలు వరద ముంపునకు గురి కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జెన్కో అధికారులకు సూచించారు. శుక్రవారం దుబ్బపల్లి శివారులో మోరంచవాగు ముంపు పంటలను కలెక్టర్ భవేష్ మిశ్రా, జెన్కో అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలు కురవక ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.






