calender_icon.png 7 December, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత ఎన్నికల కోసం నంగునూరులో ఫ్లాగ్ మార్చ్

06-12-2025 11:11:50 PM

నంగునూరు: మండలంలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించాలనే సంకల్పంతో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శనివారం మండల కేంద్రంతో పాటు ఘనాపూర్, గట్లమల్యాల, పాలమాకుల పలు గ్రామాల్లో సిద్దిపేట సీఐ ఎం. శ్రీను ఆధ్వర్యంలో రాజగోపాల్‌పేట పోలీస్  సిబ్బందితో కలిసి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లు, గొడవలు, బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి మద్దతుదారులు పోలీసులకు సహకరించి, ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చూడడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశమన్నారు.