26-06-2025 08:10:07 AM
రామకృష్ణాపూర్, (విజయక్రాంతి): పట్టణంలోనీ పలు చౌరస్తాల వద్ద పోలీస్ నిఘా వ్యవస్థలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానిక రామాలయం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఓ పార్టీకి చెందిన ఫ్లెక్సీ కెమెరాలకు అడ్డంగా వెలిశాయి. నేరాలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే కెమెరాలకు అడ్డంగా బాధ్యత లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై పలువురు మండిపడుతున్నారు. చౌరస్తాలల్లో పండగలకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇష్టం వచ్చిన రీతిలో ఏర్పాటు చేస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా కెమెరాలకు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలను అధికారులు తొలగించి నిఘా వ్యవస్థకు తోడ్పడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.