రేవంత్ ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు
13-06-2026 12:27 AM
శంషాబాద్‌కు రావాల్సింది బెంగళూరుకు పయనం
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాం తి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. సీఎం శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్‌లో ల్యాం డింగ్‌కు ఏటీసీ అనుమతించలేదు. సీఎం రాత్రి అక్కడే బస చేయనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది.






