13 June, 2026 | 1:32 AM

పైప్‌లైన్‌ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

13-06-2026 12:28 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): మంచినీరు, డ్రైనేజీ పైప్ లైన్ ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని  స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను  హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ లోని వైఎస్‌ఆర్ పార్కు కాలనీలో ఇటీవల నిర్మించిన మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో స్థానిక బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రవి యాదవ్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ వైఎస్‌ఆర్ పార్కు కాలనీలని సందర్శించి మంచినీటి పైప్ లైన్ లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వల్ల ప్రజా ధనం వృధాకావడంతో పాటు మంచి నీటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే పైపులైన్లను సరిచేసి ప్రజలకు మెరుగైన నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా వెలగని వీధి దీపాలకు మరమత్తు లు నిర్వహించి అందకారాన్ని తొలగించాలని కోరారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులు చెత్తా చెదారం, మట్టికుప్పలను తొలగించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్  రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రవి యాదవ్, శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, తలారి శ్రీకాంత్ ముదిరాజ్, టి. సోమన్,  బీఆర్‌ఎస్ ముషీరాబాద్ మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, కాలనీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, నాయకులు పూస గోరఖ్ నాథ్, మచ్చేందర్, గోక నవీన్ తదితరులు పాల్గొన్నారు.