15 June, 2026 | 2:44 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ఈనెల 7న చెకుముకి సైన్స్ సంబరాలు

01-11-2025 05:10 PM

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు విద్యాసాగర్ 

నకిరేకల్,(విజయక్రాంతి): జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 7 నుండి నిర్వహించే చెకు ముకి సైన్సు సంబరాలను విజయవంతం చేయాలని జెవివి రాష్ట్ర కమిటీ సభ్యుడు కనుకుంట్ల విద్యాసాగర్ గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సుకన్య కోరారు. శనివారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జే వి వి చెకు ముకి సైన్స్ సంబరాల పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పాఠశాల స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో 8, 9, 10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో  సైన్స్ లో  రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7 న పాఠశాల స్థాయి, 21న మండల స్థాయి పరీక్ష  మండల కేంద్రాల్లో, 28న జిల్లా స్థాయి పరీక్ష  జిల్లా కేంద్రాల్లో, డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర స్థాయి పరీక్షలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైన్స్ ప్రచార సంస్థ, జనవిజ్ఞాన వేదిక  నిర్వహించే చెకుముకి సైన్స్ సంబురాలు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని  కలిగించి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి దోహదపడతాయన్నారు.