calender_icon.png 1 November, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు

01-11-2025 05:06:31 PM

మాగనూరు: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యకార క్రీడా డైరీ డెవలప్మెంట్ మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలను శనివారం మాగనూరు మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాగనూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్లడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రతినిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడం ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు కోరారు.