21-08-2025 01:07:39 AM
మరింత అప్పుల్లోకి రైతన్నలు
నాగర్ కర్నూల్ ఆగస్టు 20 ( విజయక్రాంతి )ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలు పంటలను ముంచెత్తా యి. చెరువులు కుంటలు, నాళాలు ఉప్పొంగుతూ పంట పొలాల మీదుగా వరద ప్రవ హించడంతో పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునగడంతోపాటు వరి వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఆరుగాలం కుటుంబమంతా కష్టపడి సాగు చేస్తుకున్న పంట ముసురు వర్షం ముంచెత్తడంతో రైతన్న ఆశలు వరద పాలయ్యాయి.
ఒక్కో ఎకరాకు సుమారు 50 నుండి 80 వేల దాకా ఖర్చు చేసి సాగు చేయగా సరిగ్గా పొట్ట దశకు వచ్చే పంటలన్నీ ఈ ముసురు వాన పొట్టన పెట్టుకుంది. ముఖ్యంగా ఎర్ర నేలల్లో సాగైన పత్తి, మొక్కజొన్న పంటలన్నీ వరుసగా కురుస్తున్న ఈ ముసురు వానతో నీరు పట్టి పంట ఎర్రబారి దిగుబడి పైన పూ ర్తి ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వాన కాలంపత్తి 2,61,640 ఎకరాలు, వరి 1,0 1,048 ఎకరాలు, కందులు 3,406 ఎకరా లు, మొక్కజొన్న 51,128 ఎకరాలు, జొన్న 4,213 ఎకరాలు, మినుములు 634 ఎకరాలు, ఆముదం 31 ఎకరాలు మొత్తం 4, 22,100 ఎకరాలు పంట సాగు చేశారు.
గత మూడు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లాలోని తాడూరు, తిమ్మాజిపేట, తెలకపల్లి, కల్వకుర్తి, ఉప్పునుంతల, ఊరుకొండ మండలాల్లోనే అత్యధికంగా వర్షపాతం నమోద యింది. జిల్లా అంతట 319 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 16 సెంటీమీటర్ల సా ధారణ వర్షపాతం నమోదయింది. ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలన్నీ ఎర్ర నేల లు ఉన్న ప్రాంతం కావడం విశేషం. ఆయా ప్రాంతాల్లోనే అత్యధికంగా పత్తి, మొక్కజొన్న పంటలను సాగయ్యాయి.
వరుసగా కురుస్తున్న ఈ ముసురు కారణంగా ఎర్ర నేలలు నీరు పట్టి వాటి వల్ల ఎర్ర రంగు తెగులు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఈ ఏడాది పంట నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని రై తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటల సాగు కోసం అప్పులు చేసిన రైతన్నలు పంటలు దెబ్బ తినడంతో దిగాలు చెందుతున్నారు.
తెల్లవారకముందే యూరి యా కోసం ఆయా దుకాణాల వద్ద బారులు తీరి యూరియా పంటలకు వేసుకున్నప్పటికీ ఈ ముసురు వర్షాల కారణంగా అది వరదల్లోనే కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత కారణంగా ఎకరాకు రెం డు బస్తాలు మాత్రమే పంపిణీ చేస్తుండడంతో ఈ ముసురు వర్షాల కారణంగా రైతులు తమ పంటను బ్రతికించుకోవడం కోసం మరింత యూరియా వినియోగించే అవకాశం లేకపోలేదని వాదన వినిపిస్తోంది.
నాలుగు ఎకరాల పత్తి పంట వాగులో కొట్టుకుపోయింది.
నేను సాగు చేసిన నాలుగు ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా కుంట కట్ట వద్ద నీరు అధికంగా చేరి పూర్తిగా నీటమునిగింది. దీంతో సుమారు ఒక ఎకరాకు 60వేల దాకా ఖర్చు చేసుకున్నప్పటికీ కనీసం పంట బ్రతుకుతుందన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలి.
వెంకటయ్య, రైతు, అవురాశి పల్లి గ్రామం
వరి పంటలకు పెద్దగా నష్టం లేదు.
ప్రస్తుతం కురుస్తున్న ఈ ముసురు వర్షాల కారణంగా పత్తి మొక్కజొన్న పంటలకు అత్యధికంగా నీరు చేరిన పంటల్లో న ష్టం జరిగే ఆస్కారం ఉంది. కానీ వరి పంట కు ఎలాంటి నష్టం లేదు. చెరువులు కుంట లు అలుగుపరి వరద ప్రవాహం ఉన్న ప్రాం తాల్లో ఉన్న పంటలు మాత్రం పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎర్ర నేలల్లో ఉన్న పంటలు ఎర్రబారి తెగులు వచ్చే అవకాశం ఉంది.
యశ్వంత్ రావు, వ్యవసాయ శాఖ అధికారి, నాగర్ కర్నూల్ జిల్లా